నెగ్గు
స.క్రి.
- బలాత్కారముగ త్రోయు (ధా.మా.)
నెగ్గు 1
అ.క్రి.
- నెఱవేఱు, సిద్ధించు
- గీ. మీదు కార్యంబు నెగ్గదు మీర లరిగి, వేగ సుగ్రీవు చెల్మి గావింపుఁ డనిన, వచ్చినారము.... మొ.రా.కిష్కిం.5.
- మను, బ్రతుకు
- కం....చంద్రిన్, మగ్గము వెట్టిన మొదలే, నెగ్గవయో సింగ భూప నృపసుమచాపా. చంద్ర. వి. 3. 43.
- కార్యసిద్ధినొందు, జయమునొందు
- వ్యవ. వానితో కక్షగట్టి యెన్నఁటికి నీవు నెగ్గలేవు
- జ: నెగ్గించు
నెగ్గు2
అ.క్రి.
పరభాషా సారూప్యత గల పదములు
- తమిళము నెగ్గు
- బెండువడు, నిస్సత్వమగు
- వ....హరి చతురంగబలంబున కూరకయె దారున బెగ్గడిల నెగ్గి వేఁటకాండ్రు చోపుడు వెట్టఁ బొదలు వెల్వడి పిట్ట లెగిరిపోవుచాడ్పున. ప్రబంధ. 788.
- సీ. అతివ బాహువులతోఁ బ్రతిగాక సిగ్గున నెగ్గి మృణాళముల్ నీటఁబడియె. సానందో. 1. 8.పొ.
నెగ్గు3
వి.
- గుండె యదరుట యందలి యనుకరణము (దీనికి అనుధాత్వను ప్రయోగమున నెగ్గురను రూపమగును.)
- ఉ. ఆరసికాగ్రగణ్యుఁడపుడయ్య వరోధ విచిత్ర కేళికా, గారము సొచ్చి చొక్కటపుఁ గంకటిపై నొక మోహనాంగ శృం, గారుని తోడ దీపకళికల్వెలుఁగ న్నిదురించుచున్నయ, న్నీరజగంధిఁ జూచి యెద నెగ్గురనం గదు విస్మితాత్ముఁడై. శుక. 1.115.