శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

తగులుకొను అ. క్రి.(మూ:తగులు)
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. తగుల్గొను
  2. తవులుకొను
  • తగులు
  1. లగ్న మగు, బద్ధ మగు
    1. చం. .....ప్రాణనా,థునిఁగనకాంబరాంచలముతోఁగుసుమాయుధ వాగురానిబం,ధనమునుబోని క్రొవ్యిరులదండఁ దగుల్కొనఁజుట్టె...... పారి. 5.79.
తగులుకొను స. క్రి. ఆ. క్రి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. తగుల్గొను
  2. తవులుకొను
  1. అంటుకొను,కాల్చు
    1. శా.సేవింపంగఁ జెలంది నేమముఁబరీక్షింపన్ లలాటాక్షుఁడా, త్మావాసంబున నున్నదీప శిఖికీలాభీలతీవ్రప్రభా, వ్యావిద్దాంబరమై తగుల్కొని తదీయాగారముల్ ధూనుమై,పోవం జేసిన లేచి కీటకముహృద్భూతవ్యథా క్రోధమై, కాళ.2.98.
  2. అంటు, సోఁకు
    1. గీ.ఉగ్రతర సప్తజిహ్వల నూర్ధ్వలోక, దాహమొనరింతు ననురీతిఁ తత్తపోవ, లము భువర్లోకమును మించి యమరనగరిఁ, దగులుకొన్న సుపర్వులు తల్లడిల్లి. దశా. 4.74.
తగులుకొను స. క్రి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. తగుల్గొను
  2. తవులుకొను
  1. వలచు, మోహించు
    1. కం. మగఁడేల రాఁడొ యొండొక, మగువందగులుకొని నన్ను మఱచె నొకొ మనం, బగలెడుననిదిగులొందుచుఁ, దెగువన్ బ్రాణంబు విడిచె దీనాననయై. శుక. 1.328.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • కవితా రెడ్డివీరి బ్లాగు పేరు తెలియదు