శోధింపుము

best viewed in IE and firefox

జింక వి.
పరభాషా సారూప్యత గల పదములు
 1. కన్నడ జింకె
 1. ఒక జాతి లేడి, న్యంకువు
  1. గీ. ...... మృగ మొప్పు నిఱ్ఱి యన గ మృగియు, జెలఁగుచుండును లేడి నా జింక యనఁగ, న్యంకు నామంబు దగు ........ ఆం. భా. 2. 84.
 2. మృగము, లేడి
  1. సీ. సింహ బుబారిఁజొచ్చిన గజంబులభంగిఁబులి కగ్గ మైన జింకల విధమున. భార. కర్ణ. 2. 2__3.
  2. పూర్తి పద్యము
  3. మ. ....... తాట కేయ పలభుక్కూ టాకృతిం జింకతో,లున నాచ్ఛన్నుఁడ వై ......... ఆము. 3. 29.
  4. శా. ...... నా, జింకల్ భు క్తి గొనంగ నేమిటికిరాచేచిట్ట మ్రోయించి యా, తంకంబున్ ఘటియించితి .( ’ నా చింకల్’ అని పరుషాదిగా వేటూరివారి పాఠము. చి. ని. లో పరుషాదిగా పదము గలదు. కాని దానికి ఉదాహరణము మాత్ర మీయఁబడలేదు).......... హర. 1. 4.
  5. జ : జింక తలచుక్క, జింక తాలుపరి, జింక తాలుపు జింక పొక్కిలి, జింకమావు దేవర, జింకరవుతు, జింక వార్వపు జోదు, జింక వార్వపు వజీరుఁడు.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

 • కవితా రెడ్డివీరి బ్లాగు పేరు తెలియదు