శోధింపుము

best viewed in IE and firefox
Page 1 Of 1 1

కసరు అ.క్రి.
 1. కోపపడు; విసుగుకొను
  1. గీ... ఓ తండ్రియాకోడయలనుబట్టి, గట్టిచేసెదనిఁక నింత కసర వలవ,దు... నీలా. 2.62.
  2. క. పెసరుంబప్పేమిటి కని, కసరు న్నెయి గొనఁడు పండుగను గొయగూరే, కొనరున్... బహు. 5.8.
  3. సీ.కసరి యెంగిలిచేతఁ గాకి వేయనివాఁడు సతతాన్నదానప్రశస్తుఁడయ్యెఁ. పాండు. 4.210.
 2. విజృంభించు, హెచ్చు
  1. సీ.జలరెఖ లంబర స్థలి విశాలము లయ్యెఁ గసరుచుఁ దెమ్మెరల్ విసరఁ జొచ్చె. ఇందు. 3.106.
  2. గీ.కసరి యెవ్వనికంఠహుంకారరవము, కొండ చిలువలకులములోఁ గూర్చ నహుషు, నట్టిపరమ మహాశైవు ననఘ తేజు, వెదకి రానందనవనములో విబుధమునులు. కాశీ.2.40.
 3. చలించు
  1. ద్వి.పసిఁడిసలాక సుపాణిముత్తియము, కసరక నిలుచుక్రొక్కారు మెఱుంగు. ద్వి.భాగ. 7.(శ.ర.)
కసరు స.క్రి.
 1. ఉపాలంభించు,తిట్టు.(చి.ని,ధాతుమాల)
  1. క.అంపఁ దగువారిఁ గసరుచు, నంపి... మనుచ.5.23.
కసరు వి.
 1. కోపము
  1. గీ.అలఁతఁ బానుపుపైఁ బొరలాట తెలుపఁ, తెగువ లోలోననే నవ్వునగవు తెలుపఁ, గలఁకమామీఁది పనిలేనికసరు తెలుపఁ,బొలఁతి రేలు నీయున్కియే పులుగు గాదె. ఆము. 5.60.
  2. సీ.పసుల గోడలు నన్పి వసుధపైఁ గూల్పనిము సురువానలమీఁదఁ గసరుఁ జూపు. శుక. 2.504.
 2. పొగరు,గర్వము
  1. ద్వి.కసరెక్కి యంత ముష్కర్ము సేయంగఁ, బొసఁగించి యెగ వేయ బొంక నీ కెంత, ముంగల వెనుకకు మూఁడులోకముల, నంగన నీయంత యాఁడుది లేదు. ద్వి.సారంగ. 3.104.పో.
 3. గాలివాన
  1. వ... పెల్లడరునిట్టూర్పుగాడ్పు విసరులన్ గసరెత్తి....పొంగి చింతాసాగరంబు వేగిరంబ వెల్లివొడిచెనన.... మనుచ.(కసరెత్తి-తుపాను కలిగి.)
  2. గీ.బిట్టు కసరెత్తి మున్నీటినట్టనడిమి, కరుగఁగా జీను వైచినతరణి యనఁగఁ,జక్క సాగినరశ్మిచేఁ జుక్క ఱేఁడు, సమయవశమున గగనమధ్యమున నిలిచె. రా.వి. 3.19.
 4. విజృంభణము, అతిశయము
  1. క.అసురుసు రని సొలయున్ రా,జసురేంద్రుఁడు మలయపవనుచలిక నరునకున్. కవిరా. 5.265.
 5. దోషము
  1. క.ఈరత్నమునకుఁ బ్రుప్పియు, గారయుఁ గర్కశత యనఁగఁ గసరులు మూఁ డే,పారు నవి యెల్లఁ దెలియక , వారక ధరియింప జగతి వల దెవ్వరికిన్. రత్న.28.
  2. జ:కసరుఁదనము,కసరుకొను.
కసరు వి.
 1. పేగులలోని పసరు
  1. ఉదా.తొక్కితే కసరు గక్కుతావు చూడు. (వ్యవ)
కసరు2
 1. కసురు
  1. గీ.కాయ గస రేఱికొని తించుఁ గానలోన, ఘోరదుఃఖముల్ గుడువంగఁ గోర నేల. భా.రా.సుం.178.
  2. జ:కసరుఁగాయ.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

 • లక్ష్మీ దేవి మాలతీమాధవం
 • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు