శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

కల్ల వి.
పరభాషా సారూప్యత గల పదములు
 1. కన్నడ కళ్
 2. తమిళము కళ్లమ్
 1. అసత్యము, అనృత వచనము
  1. ఆ. వె.జల్లి బురుడ బొంకు పొల్లు దబ్బఱ కల్ల, డబ్బు తక్కుటక్కు ఠవళి తవళి, తసుకు నసుకు దుద్దు తటవట ఠవఠవ, సట హుళిక్కి నా నసత్య మభవ. ఆం.భా.1.116
 2. తప్పు, నేరము, అపరాధము
  1. మత్తకోకిల. కల్లలేదని విన్నవించుట గాదు వల్లభ యీతనిం, బ్రల్లదుం దెగఁ జూచి తేని.. మా, తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి చిక్కుదు రీశ్వరా. భాగ.10. పూ.1767
  2. గీ. కాశికాపత్తనద్రోహిఁ గావు మభవ, విశ్వపతి దూషితునిఁ బ్రోవు విశ్వనాథ, కల్ల చేసితి రక్షింపు కాలకంఠ, యనుచుఁ బ్రార్థించు భీమనాయకునిఁ దపసి. భీమ.3.197
 3. పరుష వచనము
  1. సీ. తనతల్లి విసివి నిన్నను గొన్ని కల్లలాడుటయు నే వెళ్ళిపోవుటయుఁ గలదు. పరమ.3.293
 4. భంగము, హాని
  1. వ. ఈధర్మానకు ఎవ్వరు కల్ల తలంచినాను పంచ మహాపాతకాలు చేసినదోషమును పొందుదురు. 1293 గు.జి.అమీనాబాదుశాసనము.
  2. గీ. కేశి నాశ గిరీశ లక్ష్మీపతి త్రిపు,రారి వసుదేవసూనుఁడ త్రక్ష యనుచు, జపము సేయుదు రెవ్వ రావిపులపుణ్య, ఘనులఁ గదిసినప్పుడ మీకుఁ గల్ల వచ్చు. (యముఁడు తనకింకరులతో నన్నమాట) కాశీ.3.161
 5. తోఁట లోనగువాని వెలుగు, కట్టువ
  1. సీ. ప్రాచీనసంజ్ఞలు పరఁగుచుండు. గీ. వెలుగు కల్లయనంగను.. ఆం.భా.2.12
కల్ల విణ.
 1. అసత్యమైనది, అనృత మైనది
  1. మ. గుణమా సెబ్రవివేకమా నహి మనోగూఢత్వమా లేదు భా,షణమా కల్ల విచారమా ఠవళి వంశాచారమా నాస్తి.. హంస.5.111
  2. సీ. పాలు పిండనిగొడ్డు బఱ్ఱె కార్పులుమెండు కల్ల పసిండికిఁ గాంతి మెండు. వేణు.17
 2. పరుషము (శ.ర.)
 3. మాయాకల్పితము; మాయావి
  1. ఆ. పునుకతాల్పువిల్లు దునిమెఁ దాటకఁ జంపె, ఖరునిఁ దేర్చె వాలిఁ గడవఁబనిచెఁ, గల్ల జింకఁ ద్రుంచె గండ గొడ్దలితాల్పు, గరువ మడఁచె నతని కడిమియనదె. అచ్చ.రా.యు.57
  2. క. విను మేము కల్లసారెలు, గొని కపటపునెత్త మాడుకుశలతఁ గా దొ,ప్పనివారి నేపడంచుట, ఘనబాహుస్వైరకేళిఁ గాని దురాత్మా. భార.శల్య.2.281
  3. పూర్తి పద్యము
  4. ఆ. అపుడు మొసలి వేల్పుటతివయై తనతొంటి, కతయు నచట నున్న కల్లతపసి, దెఱఁగు నతని తోడ నెఱిఁగించి పసిఁడితే, రెక్కి వేల్పు ప్రోలి కేఁగె నంత. అచ్చ.రా.యు.418
  5. గీ. అరితికాఁ డైన పూవిల్తు నట్టె కొట్టి, కల్ల వెల్లిగఁ జేసె నా కాఁపురంబు.(రతివిలాపము)(కల్లవెల్లియగు=చెల్లాచెదరగు) పార్వ.3.117
  6. ద్వి. ఎదురను ఒసి గుఱ్ఱ మేనుంగు బండి, యదియేమి సోద్దెమో కదియంగ వెఱచు, నల్లంతఁ బొడగని చల్లన నవసి, కల్లవెల్లై పాఱు.. బస.పు.4.34. పం.
  7. జ: కల్లతనము, కల్లరి, కల్లరితనము, కల్లరీఁడు,కల్లరుజు, కల్లవాఁపు. కల్లవాటు, కల్లసేయు.

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

 • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు