శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

గూబ వి.
  1. గోడలో బిగించు దర్వాజాకమ్మి
  2. ఏతపు బొక్కెనపై పైవైపున అడ్డచీల దూర్చుటకు ఉన్న రింగు
గూబ1 వి.
పరభాషా సారూప్యత గల పదములు
  1. సంస్కృతము ఘూకః
  2. కన్నడ గూబె
  1. గ్రుడ్ల గూబ
    1. క. ఎఱసంజ దాసనంబుల, తెఱఁగయ్యెను గూబ లెల్లదెసలఁ జెలంగెన్, వఱడు లఱచె నుల్కలు వడె, నెఱిచెడి సురగాలి విసరె నిలువక పెలుచన్. ఉ.హరి.2.24
    2. సీ. చీకటితప్పు సేసిన సరోరుహనేత్ర గూబ యై వసియించుఁ గోటరమున కాశీ.2.80
    3. సీ. ఇరుగింటిదయ్యంబు పొరుగింటికిని గూబ యెదురింటివారల కెదురుచుక్క.(ఇట గూబవలె అశుభదాయకురా లని భావము) శుక.3.20
    4. ద్వి. కటకటా వెఱచునె కాలకౌశికుఁడు, కుటిల విచార నీగూబజంకెనల.(గూబజంకెన=గూబ బెదరింపు వంటి బెదరింపు, వ్యర్థమైన బెదరింపు) ద్వి.హరిశ్చ.ఉ.768పం.
గూబ2 వి.
  1. కర్ణమూలము
    1. ఆ. అతని చెవులు గూబ లంటఁ బెఱికి. రామా.8.148.ఆం.భా.2.144

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు

  • లక్ష్మీ దేవిమందాకిని
  • అనిల్ కుమార్వీరి బ్లాగు పేరు తెలియదు